వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు

న్యూఢిల్లీ : నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్కడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం తో పాటు ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులు లేదా ఇతర వ్యక్తులతో సంప్రదింపులు జరపలేక పోతున్న కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాల‌ని కోరింది.

సహాయక చర్యల సమన్వయాన్ని సులభతరం చేసేందుకు సంబంధిత వ్యక్తుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో ప్రస్తుతం ఉన్న లేదా చివరిగా తెలిసిన ప్రాంతం, ట్రావెల్/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలను హెల్ప్‌లైన్ అధికారులకు అందించాలి. రెసిడెంట్ క‌మిష‌న‌ర్ వందన మొబైల్ నెంబ‌ర్ 9871999044. చ‌క్ర‌వ‌ర్తి పీఆర్ఓ మొబైల్ 9949351270, రక్షిత్ నాయ‌క్ , లైజ‌న్ ఆఫీస‌ర్ మొబైల్ 9618597969 లో సంప్ర‌దించాల‌ని కోరారు. హెల్ప్‌లైన్‌కు అందే విజ్ఞప్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందించేందుకు సమన్వయం చేస్తారు.

  • Related Posts

    శ్రీవారి సేవకులకు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన‌

    తిరుమ‌ల‌ : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, అత్యవసర పోలీసు సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల టూ టౌన్ పోలీసులు, టీటీడీ…

    స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీతో విద్యుత్ జేఏసీ ప్ర‌తినిధుల భేటీ

    హైద‌రాబాద్ : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TEEJAC) ప్రతినిధులు ఈరోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) నవీన్ మిట్టల్ ని కలిసి విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జేఏసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *