ఏపీ గ్రీన్ కార్య నిర్వాహక కమిటీ చైర్మన్ గా నాగబాబు
అమరావతి : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి , శాసన మండలి సభ్యుడు , ప్రముఖ నటుడు నాగబాబు కొణిదలకు కీలకమైన పదవి కట్టబెట్టింది ఏపీ కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా రాష్ట్రంలో పచ్చదనం, పర్యావరణ హరితంగా మార్చచేందుకు సర్కార్ కంకణం కట్టుకుంది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్బంగా కీలక నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. తాజాగా హరితాంధ్రప్రదేశ్‌ను నిర్మించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎకోసిస్టమ్ ఎన్‌రిచ్‌మెంట్ నెట్‌వర్క్’ (AP-Green) కార్య నిర్వాహక కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు శాసనమండలి సభ్యులు నాగబాబు కొణిదల. ఈ సందర్బంగా తన సోదరుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం మేర పచ్చదనాన్ని పెంపొందించే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ప్రకృతిపై అపారమైన ప్రేమ కలిగిన నాగ బాబు కొణిదల ఏపీ గ్రీన్ లక్ష్యాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చడంలో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాగబాబును క్యాబినెట్ హోదాతో ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.