స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీతో విద్యుత్ జేఏసీ ప్ర‌తినిధుల భేటీ

హైద‌రాబాద్ : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TEEJAC) ప్రతినిధులు ఈరోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) నవీన్ మిట్టల్ ని కలిసి విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు ప్రధానంగా క్రింది సమస్యలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. 01 ఏప్రిల్ 2026 నుండి అమలు కావాల్సిన పీఆర్సీ కోసం వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాల‌ని కోరారు. 01 ఫిబ్ర‌వ‌రి 1999 నుంచి 31 ఆగ‌స్టు 2004 వ‌ర‌కు ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసిన విధానాన్ని విద్యుత్ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తింప చేయాల‌ని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్‌ మార్పు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు పదవీ విరమణ అనంతరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రస్తావించారు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉద్యోగులందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను వెంటనే క్లియర్ చేయాలని విన్న‌వించారు. విద్యుత్ సంస్థల్లోని వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గుర్తు చేశారు.. ప్రస్తుత ఉద్యోగుల కొరత కారణంగా విధుల్లో ఉన్న సిబ్బందిపై అధిక పనిభారం పడుతోందని, దీనివల్ల ఉద్యోగుల పనితీరుతో పాటు వినియోగదారులకు అందించే సేవలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు.

విద్యుత్ రంగ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అర్హులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కొత్త నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజ‌న్ ఉద్యోగులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా జేఏసీ ప్రతినిధులుస్పెషల్ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ రంగంలో క్షేత్రస్థాయిలో కీలక సేవలు అందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై నవీన్ మిట్టల్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సంబంధిత శాఖలు , విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా 15 రోజుల్లో అన్ని విద్యుత్ సంస్థల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నార‌ని జేఏసీ నేత‌లు వెల్ల‌డించారు. అలాగే TGRPDCL విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే నాలుగు విద్యుత్ సంస్థల్లో బదిలీలు చేపట్టేలా చూస్తామని , టీజీఆర్పీడీసీఎల్ విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

  • Related Posts

    ఏపీ గ్రీన్ కార్య నిర్వాహ‌క క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌బాబు

    అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , శాస‌న మండ‌లి స‌భ్యుడు , ప్ర‌ముఖ న‌టుడు నాగబాబు కొణిద‌ల‌కు కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్టబెట్టింది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం, ప‌ర్యావ‌ర‌ణ హ‌రితంగా మార్చ‌చేందుకు స‌ర్కార్ కంక‌ణం…

    శ్రీవారి సేవకులకు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన‌

    తిరుమ‌ల‌ : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, అత్యవసర పోలీసు సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల టూ టౌన్ పోలీసులు, టీటీడీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *