వైసీపీలో స‌జ్జ‌లదే ఆధిప‌త్యం : విజ‌య‌సాయి రెడ్డి

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న బ‌హిరంగ లేఖ రాశారు వైసీపీ అధినేత‌కు. వైసీపీలో అవమానాలు భరించలేక బయటికి వచ్చాన‌ని పేర్కొన్నారు నాపై నమ్మకద్రోహి అంటూ వైసీపీ కోటరీ దుష్ప్రచారం చేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే నన్ను 15 నెలలు జైల్లో పెట్టారన్నారు. నాకు సంబంధం లేని లిక్కర్ స్కాంలోనూ నన్ను A5గా చేర్చారని వాపోయారు విజ‌య సాయి రెడ్డి. కాకినాడ సీ పోర్టు కేసులో కూడా A2గా చేర్చార‌ని పేర్కొన్నారు .

నమ్మకద్రోహిని అయితే ఆనాడే సజ్జల రామ‌కృష్ణా రెడ్డి మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకునేవాడినిన‌ని బాంబు పేల్చారు మాజీ ఎంపీ . ఇప్పుడు వైసీపీలో నంబర్-2 జగన్.. నంబర్-1 సజ్జల.. సజ్జలకు తలవంచి పని చేయడం నావల్ల కాదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జగన్‌కు నేను నమ్మకద్రోహం చేయలేదని , ఏనాడూ చేయ‌బోనంటూ ప్ర‌క‌టించారు. త‌న‌కు న‌మ్మించి మోసం చేయ‌డం త‌న వ‌ల్ల కాద‌న్నారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటే తాను ఏనాడో పార్టీ మారి ఉండేవాడినంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. త‌న‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకుని , వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసే ప‌ని చేయొద్ద‌ని సూచించారు. ఇదిలా ఉండ‌గా విజ‌య సాయిరెడ్డి చేసిన తాజా కామెంట్స్ వైసీపీలో చ‌ర్చ‌కు దారితీశాయి.

  • Related Posts

    విజ‌య్ సంచ‌ల‌నం సింప్లిసిటీకి ద‌ర్ప‌ణం

    చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న కేవ‌లం 2 ఏళ్ల కాలంలోనే రాష్ట్రంలో పెను సంచ‌ల‌నం సృష్టించారు. అనాది కాలంగా రాజ‌కీయ ప‌రంగా త‌మ‌దైన ముద్ర వేసిన , ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన డీఎంకే,…

    నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక : సీఎం

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న 20 గంట‌లకు పైగా రాష్ట్రం అభివృద్ది, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌తిరోజూ ప‌ర్య‌వేక్షిస్తూ, స‌మీక్షిస్తూ పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *