Thursday, 12 November 2026

విపో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డారిన్ టాంగ్ తో సీఎం భేటీ

newsseals-APCM

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభ‌మైంది ఏపీ సీఐఐ స‌మ్మిట్ 2026. ఈ సందర్భంగా దేశ‌, విదేశాల నుంచి వివిధ వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, చైర్మ‌న్ లు, సీఈఓలు, సీఎండీలు, ఎండీలు హాజ‌ర‌య్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో విశాఖపట్నంలో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్-WIPO డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌ భేటీ అయ్యారు. WIPO–ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఏర్పాటు భాగస్వామ్య కార్యక్రమం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు మేధో సంపత్తి హక్కులు (IPR), పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞాన పరిరక్షణపై శిక్షణ అందించే అవకాశాలను చర్చించారు.

రాష్ట్రం లోని చేనేత, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (GI Tag) సాధించడం, ఇప్పటికే గుర్తింపు పొందిన ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ, వాటి నాణ్యత-బ్రాండింగ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అంశాలపై WIPO సహకారాన్ని సీఎం కోరారు. రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు సహకరిస్తున్నామని తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రొత్సాహాన్నిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని WIPO ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. ఇదిలా ఉండ‌గా సీఎం చేసిన ప్ర‌తిపాద‌న‌కు విపో డైరెక్ట‌ర్ జ‌నర‌ల్ డారిన్ టాంగ్ సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *