newsseals.com

బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను

November 17, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఆక్వాన్ తుపాను గడిచిన 9 గంటల్లో స్థిరంగా కేంద్రీకృతమైంద‌ని వెల్ల‌డించారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్ర‌క‌ర్ జైన్. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. చెన్నైకి 610కి.మీ, మచిలీపట్నానికి 660 కి.మీ, విశాఖపట్నానికి 670 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యింద‌న్నారు. పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంద‌న్నారు ఎండీ. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – తుని మధ్య అక్వాన్ తుపాను తీరం దాటే అవకాశం ఉంద‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

​తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి.మీ, గరిష్ఠంగా 145 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయ‌న్నారు. ఈ సంద‌ర్బంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చ‌రించారు. తుపాను ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌న్నారు. గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు ఎండీ. తుపాను సమస్యల పరిష్కారం కోసం ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ను ఉప‌యోగించాల‌ని కోరారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 ల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు ప్ర‌ఖ‌ర్ జైన్. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Related News