newsseals.com

అర‌బిందో ఫౌండేష‌న్ రూ. కోటి విరాళం

November 19, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : అర‌బిందో ఫార్మా కంపెనీ అర‌బిందో ఫౌండేష‌న్ ద్వారా భారీ ఎత్తున సీఎస్ఆర్ కింద కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) కు సంబంధించి మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న కోసం రూ. కోటి విరాళాన్ని అందించారు. ఈ సంద‌ర్బంగా అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్ , ఫార్మా కంపెనీ వైస్ చైర్మ‌న్ కె. నిత్యానంద రెడ్డి విరాళానికి సంబంధించి చెక్కును తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కు త‌న కార్యాల‌యంలో అంద‌జేశారు. ఈ విరాళం పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయడానికి, పాఠశాలలోని వసతులను మరింత బలోపేతం చేయడానికి దోహద పడుతుందని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు డీజీపీ సీవీ ఆనంద్.

ఈ విరాళం అందేలా నిరంతరం కృషి చేసిన హైదరాబాద్ సీపీ మహేష్ ఎం. భగవత్ , సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్‌లను డీజీపీ అభినందించారు. ఇదిలా ఉండ‌గా అర‌బిందో ఫౌండేష‌న్ విద్య‌, ఆరోగ్యం, ఉపాధి , శిక్ష‌ణ , త‌దిత‌ర రంగాల‌లో శిక్ష‌ణ ఇస్తోంది. అరబిందో ఫార్మా ఫౌండేషన్ అనేది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ . త‌న కంపెనీకి చెందిన సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా పేదలు, గ్రామీణ ప్రజలు, విద్యార్థులు, మహిళలు, రైతులకు సహాయం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. విద్య: ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, మరమ్మతులు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు క‌ల్పిస్తోంది. పేదలకు ఆరోగ్య సేవలు, ఆసుపత్రులకు వైద్య పరికరాలను అందిస్తోంది.

Related News