newsseals.com

న‌గ‌ర భ‌ద్ర‌త‌ను ప‌టిష్టత‌పై ఫోక‌స్ పెట్టాలి

November 19, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్. నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన త‌న‌తో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. రమేష్ , మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. వారు ఆయనకు పుష్పగుచ్ఛాలను అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్ మాట్లాడారు. భవిష్యత్తులో నగర భద్రతను పటిష్టం చేసేందుకు మూడు పోలీస్ కమిషనరేట్లు పరస్పర సమన్వయంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

పౌరులు సహాయం కోసం పోలీసులను ఆశ్రయించినప్పుడు, వారికి ఎటువంటి అధికార పరిధి (jurisdiction) సమస్యలు ఎదురు కాకూడదని మ‌హేష్ భ‌గ‌వ‌త్ పేర్కొన్నారు. ఉమ్మడి కృషి , అంకితభావంతో తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకు వచ్చేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించ‌డంలో పోలీసుల పాత్ర అత్యంత కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్య‌వ‌హ‌రంచాల‌ని ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్. దేశంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన , జ‌న సాంధ్ర‌త క‌లిగిన న‌గ‌రంగా హైద‌రాబాద్ కు పేరుంద‌న్నారు . వృత్తి ప‌రంగా నిబ‌ద్ద‌తతో వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొన్నారు.

Related News