మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి

సియోల్ (సౌత్ కొరియా) : దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ (Mr. Sung Min, Hwang), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చో (Mr. In-sung, Cho)లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. భారత్ లోని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని..డిస్‌ప్లే తయారీదారుల కోసం ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే-మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తిరుపతి ఐఐటీ సహకారంతో ఒక అడ్వాన్స్‌డ్ ఎపిటాక్సీ సెంటర్, GaN ఎపిటాక్సీ, MOCVD, మైక్రో ఎల్ఈడీలలో ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే సాఫ్ట్-ఈపీఐ అకాడమీని ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేయాలని కోరారు. సాఫ్ట్-ఈపీఐ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ మాట్లాడుతూ… తమ సంస్థ దక్షిణ కొరియాలో GaN ఎపివేఫర్లు (epiwafers), మైక్రో-LED ఉత్పత్తులను తయారుచేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తుందని చెప్పారు. భారత్ లో ప్రస్తుతానికి ప్రత్యక్ష తయారీ, కార్యకలాపాలు లేవని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.