డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల

Spread the loveఎల‌క్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల : డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను గురువారం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు…

newsseals-ttdonlinequota
Spread the love

ఎల‌క్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ వ‌ర‌కు

తిరుమ‌ల : డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను గురువారం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు.

ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయ‌నుంది. కల్యాణో త్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీ పాలంకార సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. ఇదే స‌మ‌యంలో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అంతే కాకుండా వ‌యో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports