ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త సోనం వాంగ్ చుక్ అరెస్ట్

ల‌డ‌ఖ్ లో పెద్ద ఎత్తున కొన‌సాగుతున్న ఆందోళ‌న‌

ల‌డ‌ఖ్ : గ‌త కొన్నేళ్లుగా త‌మ‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని కోరుతున్నారు ల‌డ‌ఖ్ వాసులు. ఇటీవ‌ల ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఇందుకు కీల‌కంగా ఉన్నారు ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్ చుక్ . ఆయ‌న పేరుతో ఓ సినిమా కూడా ఉంది. ప్ర‌జ‌ల‌ను ప్రేమించే వ్య‌క్తిగా ఆయ‌న‌కు పేరుంది. ఈ స‌మ‌యంలో ల‌డ‌ఖ్ లో ఆయ‌న ఏది చెపితే అది. కానీ ఉన్న‌ట్టుండి ఆందోళ‌న‌కారులు లా అండ్ ఆర్డ‌ర్ ను త‌మ చేతుల్లోకి తీసుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ‌. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉప‌వాస దీక్ష చేప‌ట్టిన ప‌ర్యావ‌ర‌ణ యాక్టివిస్ట్ సోనం వాంగ్ చుక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విష‌యాన్ని పోలీసులు ధ్రువీక‌రించారు. ఆయ‌న వ‌ల్ల‌నే ఆందోళ‌న‌లు మిన్నంటాయ‌ని, అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింద‌న్నారు.

కొన్ని సంవత్స‌రాల నుంచి ల‌డ‌ఖ్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌డుతూ వ‌స్తున్నారు. త‌మ‌కు ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. దీనిని ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేసింది కేంద్ర స‌ర్కార్. ఈ మేర‌కు త‌న‌ను అదుపులోకి తీసుక‌వ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్యాల‌యానికి నిప్పు పెట్టారు. ఈ త‌రుణంలో అత్యంత నిజాయితీగా, శాంతియుతంగా ఉపవాస దీక్ష‌ను చేప‌ట్టారు. ఆయ‌న తీవ్ర ఆవేదన వ్య‌క్తం చేశారు. ఏదైనా చ‌ర్చ‌ల ద్వారా, శాంతియుతంగానే ప‌రిష్కారం అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే త‌న‌ను ద్రోహిగా కేంద్రం పేర్కొన‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిని ఖండించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *