వైట్ హౌస్ కార్య‌ద‌ర్శి క‌రోలిన్ లీవిట్ షాకింగ్ కామెంట్స్

Spread the loveఅమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ తీవ్రతరం కావడం అమెరికా : అమెరికాలో ఏం జ‌రుగుతోంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. దేశాధ్య‌క్షుడు తీసుకుంటున్న కీల‌క నిర్ణ‌యాలు ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. మ‌రో వైపు నిధుల గడువును దాట వేయడంతో ఫెడరల్ ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్‌లోకి జారుకుంది. అనేక ఏజెన్సీలకు బడ్జెట్ లేకుండా పోయింది. ఇందుకు సంబఃధించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇలాగే…

newsseals-whitehousepresssecretary
Spread the love

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ తీవ్రతరం కావడం

అమెరికా : అమెరికాలో ఏం జ‌రుగుతోంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. దేశాధ్య‌క్షుడు తీసుకుంటున్న కీల‌క నిర్ణ‌యాలు ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. మ‌రో వైపు నిధుల గడువును దాట వేయడంతో ఫెడరల్ ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్‌లోకి జారుకుంది. అనేక ఏజెన్సీలకు బడ్జెట్ లేకుండా పోయింది. ఇందుకు సంబఃధించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇలాగే షట్‌డౌన్ కొనసాగితే వేల మంది ఫెడరల్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందంటూ హెచ్చ‌రించారు. దీంతో ఆమె చేసిన ఈ తాజా ప్ర‌క‌ట‌న
వాషింగ్టన్‌లో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలకు తోడ్పడింది.

పరిపాలన అధికారులు ఇప్పటికే సాధ్యమైన తొలగింపులకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఇది వేలల్లో ఉండే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ , ఇతర అధికారులు ఏ విభాగాలను ప్రభావితం చేయవచ్చో చురుకుగా చర్చిస్తున్నారని స‌మాచారం. ఇందుకు గాను లీవిట్ పూర్తిగా డెమొక్రాట్లపై నింద మోపింది, నిధుల ఒప్పందంపై సహకరించడానికి వారు నిరాకరిస్తున్నారని ఆరోపించింది. డెమొక్రాట్లు ప్రభుత్వాన్ని తెరిచి ఉంచడానికి ఓటు వేసి ఉంటే ఈ సంభాషణలు జరిగేవి కావు అని ఆమె ఆరోపించారు. డెమొక్రాట్లు సంక్షోభంతో రాజకీయాలు ఆడుతున్నారని మండిప‌డింది.
పత్రాలు లేని వలసదారులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలపై భిన్నాభిప్రాయాలను ఒక అడ్డంకిగా చూపింది. బైడెన్ పరిపాలన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది వేల మంది అక్రమ వలసదారులను దేశంలోకి వచ్చి ఉచిత ప్రయోజనాలను పొందడానికి అనుమతించిందని ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports