ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన త‌న్నీరు హ‌రీశ్ రావు
సిద్దిపేట‌ జిల్లా : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. ఓ వైపు మ‌క్క రైతులు మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించక పోవ‌డంతో మ‌ధ్య ద‌ళారీల‌కు అమ్ముకుంటున్నార‌ని, పెద్ద ఎత్తున న‌ష్ట పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న మార్కెట్ యార్డులో మొక్క‌జొన్న‌లు ఉంచిన రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా అన్న‌దాత‌లు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రూ. 2420 ఉండ‌గా దళారులకు అమ్ముకోవడం వలన క్వింటాలుకు 500 రూపాయలు నష్టం కలుగుతోంద‌న్నారు. స‌ర్కార్ నిర్లక్ష్యం కార‌ణంగా ఎకరానికి రైతులకు రూ. 10 వేలు నష్టం వస్తోంద‌ని మండిప‌డ్డారు. అస‌లు ముఖ్య‌మంత్రి సంచులు మోసుడు త‌ప్పా చేసింది ఏమున్న‌దంటూ ప్ర‌శ్నించారు. ఇది మంచి పద్ద‌తి కాద‌న్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో మక్కలు కొన్నామ‌ని అన్నారు. కానీ ఇప్పుడు స‌కాలంలోనే మక్కలు చేతికి అందినా ఫలితం దక్కడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డకి ప్రతిపక్షాల మీద నోరు పారేసుకునుడే తప్ప రైతుల మీద పట్టింపు లేదని ధ్వ‌జ‌మెత్తారు హ‌రీశ్ రావు. రెండు రైతు బంధులు ఇచ్చిండు మ‌రో రెండు రైతు బంధులు ఎగ్గొట్టిండంటూ ఎద్దేవా చేశారు. సగం రుణమాఫీ చేసిండు సగం రుణమాఫీ ఎగ్గొట్టిండు, కౌలు రైతులకు రుణమాఫీ చేస్తా అని మాట తప్పిండని మండిప‌డ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉండేద‌ని, కానీ కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చాక సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 3 గంటల వరకే కరెంట్ ఇస్తున్నాడని ఆరోపించారు.

  • Related Posts

    భోగాపురం ఎయిర్ పోర్టులో విమానాలు స్టార్ట్

    అమ‌రావ‌తి : ఏపీలోని ఇటీవ‌లే ప్ర‌ధాని మోదీ ప్రారంభించిన భోగాపురం ఎయిర్ పోర్టులో సోమ‌వారం నుచి వాణిజ్య విమానాల రాక పోక‌లు ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది…

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *