అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు

రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సారథి

అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు చేసే విషయంపై సానుకూలంగా స్పందించింది. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ ప్రాజెక్ట్ పై రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ఖసారధి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల‌తో పాటు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సచివాలయంలో మంగళవారం కలిశారు. జర్నలిస్టుల కోసం సిఆర్డీఎ ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల గృహ సముదాయాన్ని నాలుగు కేటగిరీలలో నిర్మించే నిమిత్తం 30 ఎకరాల భూమిని మందడం, తుళ్లూరు పరిధిలో అమరావతి హౌసింగ్ సొసైటీకి 2019లో కేటాయించటం జరిగిందని వారు వివరించారు. దానిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తూ సిఆర్డీఏ సంస్థనే డెవలపర్ గా దాని ఆధ్వర్యంలోనే ప్రాజెక్ట్ నిర్మించాలని సొసైటీ గతంలో ప్రభుత్వాన్ని కోరింద‌ని చెప్పారు.

కాగా సొసైటీకి కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగిందని మంత్రికి వివ‌రించారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 107 ఇస్తూ హ్యాపీనెస్ట్ మోడల్ లో నిర్మిస్తామని పేర్కొంది. ఇప్పుడు ఆ ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలని కోరుతూ పార్థసారధిని కోరారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను, హౌసింగ్ సొసైటీ విజ్ఞప్తిని మంత్రి నారాయణ, సిఆర్డీఎ కమిషనర్ దష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీనిని సాధ్యమైనంత త్వరగా అమలు జరిగేలా అవసరమైన వారితో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. అందులో భాగంగా మంత్రి సారధి వెంటనే సమాచార శాఖ డైరక్టర్ విశ్వనాధ్ కు ఆదేశాలు జారీ చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *