వ‌సూళ్ల వేట‌లో రాజు వెడ్స్ రాంబాయి

మూడు వారాల్లో రూ. 7 కోట్లు వ‌సూలు

నూత‌న ద‌ర్శ‌కుడు సాయిలు కంప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన త‌ను గ్రామీణ ప్రాంతంలో జ‌రిగిన య‌దార్థ ప్రేమ సంఘ‌ట‌న ఆధారంగా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఇందులో న‌టించిన న‌టీ న‌టులు సైతం త‌మ‌కు ఇచ్చిన పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌తో పాటు యువ‌త‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసింది. రాజు వెడ్స్ రాంబాయి చిత్రం న‌వంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్, స‌మీక్ష‌లు కూడా బాగుందంటూ పేర్కొన‌డంతో ప్ల‌స్ పాయింట్ అయ్యింది సినిమాకు.

రాజు వెడ్స్ రాంబాయి సినిమాను బ‌న్నీ వాసు, వంశీ నందిపాటి నిర్మించారు. వీరు చేసిన ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా ఎక్క‌డా టికెట్ ధ‌ర‌లు పెంచేందుకు ఇష్ట ప‌డ‌లేదు. ఇదే వ్యూహం ఫ‌లించింది. వారికి కాసుల వ‌ర్షం కురిపించేలా చేసింది. భారీ ఎత్తున వ‌సూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ అస్తిత్వం, న‌టీ న‌టుల స‌హ‌జ‌త్వం ఈ సినిమా కు హైలెట్ గా నిలిచాయి. బిగ్ స‌క్సెస్ అయ్యేలా చేశాయి. ఇదిలా ఉండ‌గా టికెట్ ధ‌ర‌లు పెంచ‌క పోవ‌డం వ‌ల్లే సినిమా స‌క్సెస్ కాలేద‌ని, కానీ చిత్రంలో కంటెంట్ అద్భుతంగా ఉండ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు సినీ విమ‌ర్శ‌కులు.

  • Related Posts

    చిరంజీవి ‘బ్రాండ్ అంబాసిడ‌ర్’ నియామ‌కం అబ‌ద్దం

    అమ‌రావ‌తి : గ‌త కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై గురువారం స్పందించారు చిరంజీవి టీం. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా…

    డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ సీరియ‌స్

    ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్‌ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *