టీటీడీ ఏర్పాట్లు అద్భుతం : నారా లోకేష్‌

ఘ‌నంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

అమ‌రావ‌తి : తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన పంచమి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు తెలియ చేశారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.పరమ పవిత్ర పంచమి తీర్థ సేవలో పాల్గొనేందుకు తరలి వచ్చిన లక్షలాది భక్తులకు సౌకర్యాలు కల్పించి వారికి మంచి అనుభూతిని మిగిల్చారని ప్ర‌శంసించారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించి, సమన్వయంతో వ్యవహరించిన టీటీడీ అధికారులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, పోలీసు ఉన్నతాధికారులకు, ఆ శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

తిరుమల-తిరుపతి పవిత్రను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించిన భక్తకోటికి ధన్యవాదాలంటూ పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. ఇదిలా ఉండ‌గా టీటీడీ ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ కు మంచి పేరుంది. టీటీడీ చ‌రిత్ర‌లో ఈవోగా రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఏకైక ఉన్న‌తాధికారి ఆయ‌న కావ‌డం విశేషం. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఏరికోరి త‌న‌నే ఎంపిక చేశారు. అత్యంత నిజాయితీ, నిబ‌ద్ద‌త క‌లిగిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం ప‌రిశీన‌లో త‌న‌కే ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ల‌భించ‌డం విశేషం.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *