తెలంగాణ జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్య‌మం

హైద‌రాబాద్ : ఎన్టీవీ ఛాన‌ల్ లో మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి వ్య‌వ‌హారానికి సంబంధించి ప్ర‌సార‌మైన క‌థ‌నానికి సంబంధించి తెలంగాణ కు చెందిన జ‌ర్న‌లిస్టులు దొంతు ర‌మేష్, పూర్ణాచారిల‌ను సిట్ అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోరం అధ్య‌క్షుడు ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్. హైద‌రాబాద్ లో ఆయ‌న టీజేఎఫ్ నాయ‌కుల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.
ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధిస్తోందని అన్నారు. మంత్రిపై ప్రచారంలో ఉన్న కథనంపై నిష్పక్షపాత విచారణ జరపాలని, సంస్థ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని అన్నారు. సంస్థ యాజమాన్యం అనుమతి లేకుండా ఏ వార్త కూడా ప్రసారం కాదని అన్నారు.

కానీ పెద్దలను వదిలేసి, సామాన్య ఉద్యోగులను బలి పశువులను చేయ‌డం దారుణం అన్నారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక కుట్ర ఉందని అర్థమవుతోందని అన్నారు. సంస్థలో పనిచేసే రిపోర్టర్లకు వివిధ మార్గాల ద్వారా సమాచారం చేరుతుందని అన్నారు. ఆ సమాచారాన్ని కాపీ చేసి ప్రసారం చేయడానికి సంస్థ అనుమతి తప్పకుండా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అసలు మంత్రికి సంబంధించిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రసారం చేయడానికి తెర వెనుక ఎవరు నడిపించారు..? అనేది తేలాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్. అరెస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టులు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను తక్షణమే విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *