సీఎం రేవంత్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలు

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప‌దే ప‌దే అబ‌ద్దాలు మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కేసీఆర్ పాలనలోనే కదా పాలమూరులో పరిస్థితులు మారింద‌ని, ఆ విష‌యం జ‌నానికి బాగా తెలుస‌న్నారు. శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ చేత కాద‌ని ధ్వ‌జ‌మెత్తారు శ్రీ‌నివాస్ గౌడ్. కల్వకుర్తి నెట్టంపాడు బీమా కింద ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచింది కేసీఆర్ కాదా ? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ తెచ్చిన పంపులు, కట్టిన కాలువలు కనిపించడం లేదా ? మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ కాదా ? అని నిల‌దీశారు సీఎంను .

తెలంగాణ కు దైవం కేసీఆర్ అని అన్నారు శ్రీ‌నివాస్ గౌడ్. ఆయన తెలంగాణ తేకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా ? మంచి అవకాశం వస్తే దాన్ని దుర్వినియోగం చేస్తావా ? నడుం విరగ్గొట్టి పడుకోబెట్టా అని నీచంగా మాట్లాడుతావా ? హరీష్ రావు, కే టీ ఆర్ లను మారీచుడు, సుబాహుడు అంటావా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాళ్ళు నువ్వు ఏం చేశావని అడ్డుపడ్డారు . కాలువలు తొవ్వుతానంటే అడ్డుపడ్డారా ?
మేము మాట్లాడబట్టే పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు మారిందన్నారు శ్రీ‌నివాస్ గౌడ్ . జూరాలలో కిలో మీటర్ వరకు కూడా నీళ్లు లేవ‌న్నారు. అదే శ్రీశైలం నుంచి జూరాల దాకా వంద కిలోమీటర్ల మేర నీళ్లు ఉన్నాయని చెప్పారు. ఈ స‌మయంలో మేధావులు మౌనంగా ఉంటే ఎలా అని ప్ర‌శ్నించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *