కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

పాలేరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి షాకింగ్ కామెంట్స్

ఖ‌మ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాల‌ని చూసిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను బొంద పెట్టాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రాష్ట్రంలో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి త‌న స్థాయి, హోదా మ‌రిచి ఫ‌క్తు టీడీపీ కి వ‌క‌ల్తా పుచ్చుకుని మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంది. పాలేరులో జరిగిన స‌భ‌లో రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. రాష్ట్రంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు పేరుకు పోయాయి. వాటిని ప‌రిష్క‌రించాల్సింది పోయి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం, దూషించ‌డం ప‌నిగా పెట్టుకోవ‌డం స‌బ‌బు కాదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇది ప‌క్క‌న పెడితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన దిమ్మెల‌ను కూల్చాల‌ని స్వ‌యంగా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి పిలుపు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో టీడీపీని కక్ష గట్టి దెబ్బతీసిన మాజీ సీఎం కేసీఆర్ ను.. బీఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఊర్లలో ఆ పార్టీ దిమ్మెలు కూల్చాలి. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అనుచరులు సహచరులకు విజ్ఞప్తి చేస్తున్నాన‌ని అన్నారు. మనందరిపై బాధ్యత ఉంద‌న్నారు. మమ్మల్ని బద్నాం చేయొద్దంటూ పేర్కొన్నారు సీఎం. సింగరేణిలో కుంభకోణం జరిగింది, బొగ్గు మాయమైందని.. కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. తప్పుడు ప్రచారాలతో అపోహలు సృష్టించి మారీచుడు, సుబాహుడు బలపడేందుకు సహకరిస్తున్నారని ఆర‌పించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *