రూ. 300 కోట్లు దాటేసిన స‌న్నీ డియోల్ బోర్డ‌ర్ -2

బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం

ముంబై : బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది బోర్డ‌ర్ -2 మొన్న‌టి దాకా ప‌లు సినిమాలు ప‌డుతూ లేస్తూ వ‌చ్చాయి. కానీ ఒక్క‌సారిగా ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రూ. 1000 కోట్ల‌ను దాటేసింది. ఆ త‌ర్వాత అనుకోకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ప్ర‌ముఖ న‌టుడు స‌న్నీ డియోల్ కీల‌క పాత్ర పోషించిన చిత్రం బోర్డ‌ర్-2 . ఇది బోర్డ‌ర్ స‌క్సెస్ మూవీకి సీక్వెల్ గా . విడుద‌లైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోయింది . దీంతో కేవ‌లం ఎనిమిది రోజుల్లోనే ఏకంగా రూ. 300 కోట్ల క్ల‌బ్ లోకి చేరింది. సినీ విమ‌ర్శ‌కులు, విశ్లేష‌కులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు విస్తు పోయేలా కాసుల వ‌ర్షం కురిపిస్తోంది బోర్డ‌ర్ -2. ఇందులో స‌న్నీ డియోల్ తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బాజ్వా, అన్య సింగ్, మేధా రానా వంటి నటీనటులు కీల‌క పాత్రలు పోషించారు.

ప్ర‌ధానంగా స‌న్నీ డియోల్ మ‌రోసారి త‌నలోని న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. అద్భుత‌మైన చిత్రీక‌ర‌ణ అంత‌కు మించి హృద‌యాల‌ను తాకే డైలాగులు, గ‌గుర్పొడిచే స‌న్నివేశాలు ప్రేక్ష‌క‌కుల‌ను క‌ట్టి ప‌డేసేలా చేశాయి. ఆపై సినిమాను చూసేందుకు థియేట‌ర్ల‌కు ర‌ప్పించేలా చేయ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు ద‌ర్శ‌కుడు. దీంతో బోర్డర్ 2 చిత్రం థియేటర్లలో తన విజయవంతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. గణతంత్ర దినోత్సవ వారాంతం తర్వాత వసూళ్లలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, ఇది ఒక పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు భారతదేశంలో రూ. 235.25 కోట్లకు పైగా వసూలు చేసింది.

  • Related Posts

    యాంక‌ర్ అన‌సూయ‌పై బీజేపీ నేత‌ల ఫిర్యాదు

    హైద‌రాబాద్ : జై శ్రీ‌రామ్ పేరుతో చాలా మంది బ్లాక్ మెయిలింగ్ కు పాల్ప‌డుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , భ‌జ‌రంగ్ ద‌ళ్ , త‌దిత‌ర హిందూ…

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *