భోగాపురం ఎయిర్ పోర్టు పురోగ‌తిపై స‌మీక్ష‌

కీల‌క సూచ‌న‌లు చేసిన రామ్మోహ‌న్ నాయుడు

అమ‌రావ‌తి : కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయ‌న విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పురోగతిపై స్టేక్‌హోల్డర్ల సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, AAI, BCAS, DGCA , రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రాజెక్టుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. సమయానికి పూర్తి చేసేలా ఆపరేటర్లతో చర్చించారు. ఎయిర్‌లైన్ భాగస్వాములు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైమానిక అనుసంధానం గణనీయంగా మెరుగు పడుతుందని అభిప్రాయం వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక కొత్త‌గా దేశంలో ప‌లు ప్రాంతాల‌ను ఎంపిక చేసి , నూత‌న ఎయిర్ పోర్టుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *