బాస‌ర ఆల‌యంలో సీఎం పూజ‌లు

మ‌న‌వ‌డికి అక్ష‌ర అభ్యాసం

నిర్మ‌ల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఇక్క‌డికి ప్ర‌తి నిత్యం అక్ష‌ర అభ్యాసం చేయించేందుకు తండ్రులు పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. ఇదిలా ఉండ‌గా దేవస్థానం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు శ్రీ స‌ర‌స్వ‌తి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం ముఖ్యమంత్రి గారికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సంద‌ర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బాస‌ర ఆల‌యాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో పున‌ర్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌ర్బంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ఆల‌య అభివృద్ది ప‌నుల‌కు రూ. 225 కోట్ల నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం. ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశామ‌న్నారు. రాబోయే గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌న్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *