తెలంగాణ అమ‌ర వీరుల‌కు సీఎం నివాళి

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌర‌వం ఎక్కువ అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్స‌వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం ఎ. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూల మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక ప‌రంగా , రాజ‌కీయ ప‌రంగా తీవ్ర నిరాద‌ర‌ణ‌కు గురైంది. వంద‌లాది మంది పోరాటాలు, ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు, స‌మ్మెలు చేప‌ట్టారు. ఆంధ్ర ప్రాంత దోపిడీకి వ్య‌తిరేకంగా గ‌ళం ఎత్తారు. చివ‌ర‌కు గ‌త్యంతరం లేక ఎంద‌రో బ‌లిదానాలు చేసుకోవ‌డంతో అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం సోనియా గాంధీ సూచ‌న‌ల మేర‌కు తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ప్ర‌క‌టించారు. జూన్ 2014 లో కొత్త రాష్ట్రం ఏర్ప‌డింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *