మాజీ ప్ర‌ధాని దేవెగౌడ ఆశీర్వాదం తీసుకున్న డీకేఎస్

రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న అప‌ర చాణ‌క్యుడ‌ని కితాబు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ బుధ‌వారం అనుకున్న స‌మ‌యానికి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీఎస్ , బీజేపీ, త‌దిత‌ర పార్టీల‌కు చెందిన అతిర‌థ నాయ‌కులంతా హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందారు డీకే శివ‌కుమార్. ఇవాళ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా డీకే శివ‌కుమార్ సంచ‌ల‌నంగా మారారు. కొలువు తీర‌క ముందే ఆయ‌న ప్ర‌ధాన పార్టీల‌ను శాసిస్తున్న కీల‌క నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ముందుగా నేరుగా డీకే శివ‌కుమార్ మాజీ భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి దేవేగౌడ నివాసానికి వెళ్లారు. ఆయ‌న కాళ్ల‌కు న‌మ‌స్క‌రించారు. ఆయ‌న నుంచి ఆశీర్వాదం పొందారు. త‌న‌ను శాలువాతో స‌త్క‌రించారు మాజీ ప్ర‌ధాన‌మంత్రి. అనంత‌రం ఇద్ద‌రూ చాలా సేపు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. లోక్ భ‌వ‌న్ లో జ‌రిగే ప్ర‌మాన స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిందిగా దేవెగౌడ‌ను ఆహ్వానించారు. అక్క‌డి నుంచి నేరుగా మాజీ సీఎం యెడ్యూర‌ప్ప ఇంటికి వెళ్లారు. ఆయ‌న‌తో బేటీ కావ‌డం ప్రాదాన్య‌త సంత‌రించుకుంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *