newsseals.com
News

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి

VijayaBhaskar June 6, 2026
newsseals-KalkwakuntlaKavitha
Spread the love

డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌పై ఇంకోసారి నోరు పారేసుకుంటే చీల్చి చెండాడుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ చ‌రిత్ర ఎక్క‌డ‌..? ఆంధ్రా చ‌రిత్ర ఎక్క‌డ తెలుసుకుని మాట్లాడాల‌న్నారు. కావాల‌ని ఇక్క‌డికి వ‌చ్చి రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తే ఇక్క‌డ ఎవ‌రూ చూస్తూ ఊరుకోర‌ని అన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ముమ్మాటికీ తెలంగాణ మాదేన‌ని ప్ర‌క‌టించారు.

తెలంగాణ అన్న ప‌దం డిక్ష‌న‌రీలోనే లేద‌ని బక్క‌ని న‌ర్సిములు చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న‌కు సోయి అనేది లేద‌న్నారు క‌విత‌. తెలంగాణ మాదేన‌ని, మా జాగీరేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇది పవన్ కల్యాణ్ తాతా ముత్తాతల జాగీరు కాదన్నారు. ఆంధ్రకు చెందిన మీ విషపూరిత పంజా నుండి మిమ్మల్ని కాపాడటానికే మేము తెలంగాణను సాధించుకున్నాం అన్నారు. ఇప్పుడు, ఇక్కడికి వచ్చి రాజకీయం చేయడంలో మీకున్న నైతికత ఏమిటి? అని ప్ర‌శ్నించారు. ఇక‌నైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.