కార్య‌క‌ర్త‌ల‌ను నాయ‌కులుగా త‌యారు చేస్తాం

గొడ్డ‌లి పార్టీ ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని నిరూపించాం

గుంటూరు జిల్లా : ఏపీ సీఎం , టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారిని గుర్తు పెట్టుకుంటామ‌ని, కార్య‌క‌ర్త‌ల‌ను నాయ‌కులుగా త‌యారు చేస్తామ‌న్నారు. శ‌నివారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన కాఫీ క‌బుర్లు కార్య‌క్రమంలో ఆయన పాల్గొని ప్ర‌సంగించారు. మంగళగిరిలో పార్టీ గెలిచి చాలా కాలమైంది. 2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసినా ఓడిపోయారు.. ఆ తర్వాత పట్టుపట్టి పని చేశారు. 2024లో అద్భుత విజయం సాధించారు. గెలిచిన తర్వాత కూడా మంగళగిరిలో లోకేష్ చక్కగా పని చేస్తున్నారు..ఇప్పుడు మంగళగిరి టీడీపీకి కంచుకోట అని అన్నారు.
యుద్దాన్ని గెలిపించే బాధ్యత నాది… నాతో పాటు అలుపెరగకుండా యుద్దం చేసే బాధ్యత మీది. రాష్ట్రంలోని ప్రతి బూత్ లోనూ గతానికి మించి ఓట్లు రావాల‌ని అన్నారు.

కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ పరంగా చేయాల్సిందంతా చేస్తాం… అన్ని రకాలుగా అండగా ఉంటాం… ప్రభుత్వం చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునేలా కార్యకర్తలు ఆలోచించాల‌ని పిలుపునిచ్చారు చంద్ర‌బాబు నాయుడు. మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి గొడ్డలి పార్టీ చేతులేసింది… సీపీఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని పక్కన పెట్టేసింది. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని గొడ్డలి పార్టీ మాట తప్పింది. ఇంతటితో ఆగకుండా వ్యవస్థలను విధ్వంసం చేసిందని అన్నారు. వాళ్లు చెప్పినవి చేయకపోగా మనం నిర్వహించిన డీఎస్సీ-2025పై బురద జల్లారు. కానీ అభాసు పాల‌య్యారంటూ ఎద్దేవా చేశారు సీఎం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *