త‌న మానాన త‌న‌ను ఆడ‌నివ్వాలి : గంగూలీ

ఒత్తిడికి గురి చేయ‌డం మంచిది కాదు
కోల్ క‌తా : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్య‌క్షుడు, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. దేశ వ్యాప్తంగా ఇటీవ‌ల సంచ‌ల‌నంగా మారిన ఐపీఎల్ 19 హీరో , బీహార్ కు చెందిన చిచ్చ‌ర పిడుగు , యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ పై స్పందించాడు గంగూళీ. ఇవాళ ఆయ‌న కోల్ క‌తా వేదిక‌గా మీడియాతో మాట్లాడాడు. త‌న గురించి ఎక్కువ‌గా ఆలోచించేలా చేయకూడ‌దు. వైభ‌వ్ సూర్య వంశీని ఎప్ప‌టి లాగే, త‌ను ఆడుతున్న‌ట్లుగానే ఆడితే బెట‌ర్ అని సూచించాడు.

అతనికిప్పుడు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఒత్తిడి గురించి అతను పెద్దగా ఆలోచిస్తాడని నేను అనుకోవ‌డం లేద‌న్నాడు సౌర‌వ్ గంగూలీ. ఐపీఎల్‌లో అతను ఆడటం మనం చూశాం, కానీ భారత్ తరఫున ఆడటంలోని ఒత్తిడి వేరుగా ఉంటుందని అన్నాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫార్మాట్ లో చాలా ఇబ్బందులు ఉంటాయ‌ని పేర్కొన్నాడు. ఆట ప‌రంగా వేగంతో పాటు ఎలా బంతుల‌ను ఎదుర్కోవాల‌నే దానిపై కూడా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు గంగూలీ. ఇదిలా ఉండ‌గా తాజాగా గంగూలీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *