డ్రోగో ఏరో స్పేస్ కు రక్షణ మంత్రి ప్ర‌శంస

అభినందించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి జిల్లాలో జరిగిన రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో డ్రోగో ఏరో స్పేస్ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిని పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. వాటి తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం , వారి శక్తి సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డ్రోగో సంస్థ అభివృద్ధి, డ్రోగో ఏరోస్పేస్‌గా మార్పు, స్వదేశీ సాంకేతికత ద్వారా భారత సాయుధ దళాలను బలోపేతం చేయడానికి సంస్థ చేస్తున్న కృషిని వారు అభినందించారు. దేశీయ రక్షణ తయారీ రంగంలో యువ భారతీయ సంస్థలు పోషిస్తున్న పాత్రను సంస్థ సీఈఓ యశ్వంత్ బొంతు వారికి వివరించారు .రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు యశ్వంత్ బొంతు కూడా పాల్గొన్నారు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *