కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

ప్రభుత్వ బ‌డిపై నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్ రెడ్డిని పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో 10వ‌ తరగతిలో చేర్పించారు.క్రిష్ ధరణ్ రెడ్డి విజయవాడలోని పడమట జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం పార్వతీపురంలో పదో తరగతి విద్యను కొనసాగించనున్నారు.

ఒక జిల్లా కలెక్టర్ కుమారుడు తమ పాఠశాలలో చేరడం గర్వ కారణమని, దీనితో తమ బాధ్యత మరింత పెరిగిందని ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ఈ నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంటోంది . ఇదిలా ఉండ‌గా గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (పీఓ)గా పనిచేసిన కూర్మనాథ్ కూడా తన కుమారుడిని ఇదే పాఠశాలలో చదివించడం విశేషం. తాజాగా ఎన్. ప్ర‌భాక‌ర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *