25 నుంచి తిరుచానూరు తెప్పోత్స‌వాలు

29 వ‌ర‌కు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు

తిరుప‌తి : తిరుచానూరు లోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి తెప్పోత్స‌వాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్లు ఘ‌నంగా చేస్తోంది టీటీడీ. ఉత్స‌వాలలో భాగంగా 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవం, 26న శ్రీ సుందర రాజ స్వామి వారి తెప్పోత్సవం, 27న శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. ఇదిలా ఉండ‌గా ఈ ఉత్స‌వాల‌లో గజ వాహన, గరుడ వాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నున్నాయి.

జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది. ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు టీటీడీ జేఈఓ డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, నరసింహమూర్తి, విజివో గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు

    తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్…

    బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : ఏఈవో

    తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *