ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి

Spread the loveనియ‌మించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఆదేశం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వై. శ్రీ‌లక్ష్మిని నియ‌మించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్ జారీ చేసింది ప్ర‌భుత్వం. గురువారం ఇందుకు సంబంధించి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యాన్ని సీఎస్ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలన శాఖ…

newsseals-YSrilakshmi
Spread the love

నియ‌మించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఆదేశం

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వై. శ్రీ‌లక్ష్మిని నియ‌మించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్ జారీ చేసింది ప్ర‌భుత్వం. గురువారం ఇందుకు సంబంధించి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యాన్ని సీఎస్ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఇక త‌న విష‌యానికి వ‌స్తే త‌న పూర్తి పేరు యెర్ర శ్రీలక్ష్మి. 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వ్య‌క్తి.

మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ లో ప‌ని చేశారు. కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేటాయించ బ‌డ్డారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరారు. పరిశ్రమలు, గనులు, మున్సిపల్ పరిపాలన తదితర శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేశారు. 2011లో ఒబులాపురం మైనింగ్ కంపెనీ (OMC)కు సంబంధించిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. గనుల లీజుల మంజూరులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆమెపై విచారణలు, న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగాయి.

2020లో ఆమె ఆంధ్రప్రదేశ్ కేడర్‌లోకి బదిలీ అయ్యారు. 2022లో ఒక దశలో ఆమెకు ఉపశమనం లభించినప్పటికీ, కేసుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు తరువాత కూడా కోర్టుల్లో కొనసాగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports