నాలాల్లో తీస్తున్న కొద్దీ వ‌స్తున్న పూడిక‌


24 X 7 మాదిరి చెత్త తొల‌గించే ప‌నిలో హైడ్రా

హైద‌రాబాద్ : న‌గ‌రంలో చెత్తంతా ఎక్క‌డ ఉంది అంటే మురుగు, వ‌ర‌ద కాలువ‌ల్లో ఉంది అనేట్టు మారింది ప‌రిస్థితి. ఏ కాలువ‌ను క‌దిలించినా లారీల కొద్దీ చెత్త బ‌య‌ట‌కు ప‌డుతోంది. కేబుల్ వైర్లు, చెత్త క‌వ‌ర్లు, ప‌రుపులు, దిండులు, దుప్ప‌ట్లు, సోఫాలు, కుర్చీలు.. ఇలా ఇంట్లో ప‌నికి రాని వ‌స్తువంతా మురుగు కాలువ‌ల్లోకి చేరుతోంది. వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్ల‌డానికి వీలుగా నిర్మించిన బాక్స్ డ్రైన్లు చెత్త‌తో, ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో నిండిపోతున్నాయి. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ వ‌ర్షం నీరు కాల‌నీల‌ను, ర‌హ‌దారుల‌ను ముంచెత్తుతోంది. నాలాల్లో మురుగు కాలువ‌ల్లో చెత్త ప‌డ‌కుండా ఎవ‌రికి వారు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఇక్క‌డ వ‌ర‌ద కాలువ‌ల్లో తొల‌గిస్తున్న చెత్త చెబుతోంది.

వ‌ర్షం ప‌డేట‌ప్పుడు వ‌ర‌ద నీరు ముంచెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న హైడ్రా.. వ‌ర్షం లేన‌ప్పుడు వ‌ర‌ద‌కు గ‌ల కార‌ణాల‌పై దృష్టి పెట్టింది. హైడ్రా డీఆర్ ఎఫ్ (డిజాస్ట‌ర్ రెస్పాన్స్‌), మెట్‌(మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్స్‌) 24 X 7 మాదిరి ప‌ని చేసి చెత్త‌ను తొల‌గించే ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. వ‌ర్షం ప‌డిన ప్ర‌తిసారీ పెద్ద‌మొత్తంలో చెత్త కాలువ‌ల్లోకి చేరి వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆటంకంగా మారుతున్న ప‌రిస్థితులు న‌గ‌ర‌వ్యాప్తంగా క‌నిపిస్తున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ ఎంసీ), సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(సీఎంసీ), మ‌ల్కాజిగిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(ఎంఎంసీ)తో పాటు ఇరిగేష‌న్‌, పోలీసు శాఖ‌ల స‌హ‌కారంతో హైడ్రా పెద్ద‌యెత్తున కాలువ‌ల్లోంచి చెత్త‌ను తొల‌గిస్తోంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *