జూలై లోనే విజయ్ జన నాయగన్ విడుదల
ఇదే తన సినీ కెరీర్ లో ఆఖరి సినిమా ప్రకటన
చెన్నై : హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం జన నాయగన్. రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలకంటే ముందు ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పుడు డీఎంకే ప్రభుత్వం అడుగడుగునా ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. మరో వైపు కారూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే కేసుకు సంబంధించి సీబీఐ జోసెఫ్ విజయ్ ను ప్రశ్నించింది. మరో వైపు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చర్చకు దారితీసేలా చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా విజయ్ ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. తన పార్టీ టీవీకే ఏకంగా 108 సీట్లు కైవసం చేసుకుంది.
తాజాగా జన నాయగన్ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. సెన్సార్ బోర్డు నుండి ‘A’ సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంది. వారం రోజుల్లోగా సర్టిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్నారు సినీ నిర్మాతలు. ఆ తర్వాత చిత్ర బృందం హిందీ, తెలుగు సెన్సార్ లాంఛనాలను పూర్తి చేస్తుంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం జూలై 16 లేదా జూలై 23న విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే, ఆ సమయంలోనే ‘అన్బే డయానా’ (జూలై 17), ‘మగూడం, ‘ఇమ్మోర్టల్’ (జూలై 23), అలాగే ‘డీసీ, ‘సిగ్మా’ (జూలై 31) వంటి అనేక ప్రముఖ చిత్రాలు ఇప్పటికే విడుదల కానున్నాయి.
ఒకవేళ ‘జననాయగన్’ జూలైలో విడుదలైతే, ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన ఈ చిత్రాల విడుదల ప్రణాళికలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చు. ప్రస్తుతం ఆగస్టు 7వ తేదీ ఖాళీగా ఉన్నందున, చిత్ర బృందం ఆ తేదీని కూడా లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది.