కర్ణాటక : రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ మధ్య ఆర్ఎస్ఎస్ పై చేసిన కామెంట్స్ తో దేవ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయనను భవిష్యత్తులో కర్ణాటకకు సీఎం అవుతారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. సోమవారం తను స్వంత జిల్లాకు వచ్చిన ఖర్గేకు ఊహించని విధంగా గ్రాండ్ వెల్ కమ్ అందుకున్నారు. ఇది తన జీవితంలో మరిచి పోలేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రియాంక్ ఖర్గే. సభను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిప్పన్న ఎం. కామకనూర్ మాట్లాడుతూ, ఈ ఘన స్వాగతం రాష్ట్ర ప్రభుత్వంలో ఖర్గేకున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోందని అన్నారు. కలబురిగి జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులచే ప్రియాంక్ ఖర్గేకు స్వాగతం పలికారు.
కాంగ్రెస్ నాయకులు ఆయన పెరుగుతున్న స్థాయిని ప్రశంసించారు, కొందరు ఆయన భవిష్యత్తులో కర్ణాటక ముఖ్యమంత్రి అవుతారని కూడా జోస్యం చెప్పారు. కలబురిగి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు హాజరయ్యారు. వారు గంజ్ ప్రాంతంలోని నాగరేష్వర్ పాఠశాల వద్ద ఖర్గేకు స్వాగతం పలికి, అక్కడి నుండి పార్టీ కార్యాలయానికి ఊరేగింపుగా తీసుకు వెళ్లారు; అక్కడ ఆయనకు సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వంలో ప్రియాంక్ ఖర్గే ఎంత కీలకమైన వ్యక్తిగా మారారో ఈ ఘన స్వాగతమే నిదర్శనం. ఆయన ప్రజల్లో ఆదరణ కలిగిన హోం మంత్రి, 2028లో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతారు అని కామకనూర్ పేర్కొన్నారు. కోలి, కబ్బలిగ , ఇతర సమానమైన వర్గాలను షెడ్యూల్డ్ తెగల (ST) జాబితాలో చేర్చాలని కూడా ఆయన కోరారు.















