బండి భ‌గ‌రీథ్ కు బెయిల్ మంజూరు..?

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ కు తీపి క‌బురు చెప్పింది తెలంగాణ హైకోర్టు. ఇప్ప‌టికే పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆపై త‌న‌ను అరెస్ట్ చేశారు. కానీ ఏమైందో ఏమో ఎవ‌రి ఒత్తిళ్లు ప‌ని చేశాయో తెలియ‌దు..కానీ న్యాయ‌స్థానం ఉన్న‌ట్టుండి మ‌నోడికి బెయిల్ మంజూరు చేసింది. గ‌త మే నెల 16న భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. చర్లపల్లి జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు..గత నెల 20న మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన భగీరథ్ బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యాడు..!

25న తిరిగి జైలుకు వెళ్లాడు.గత నెలాఖరులో సాధారణ బెయిల్ కోసం భగీరథ న్యాయవాదుల ద్వారా కోర్టు ను అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హై కోర్టు ఈ రోజు భగీరథ్ కు షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తు.. సాక్ష్యాలను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడవద్దని కోర్టు భగీరథ ను ఆదేశించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా మాట్లాడే కేంద్ర మంత్రి త‌న పంతాన్ని నెగ్గించు కోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఇక్క‌డ స‌ర్కార్ కూడా రేపిస్ట్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తికి వంత పాడ‌డం విస్తు పోయేలా చేసింది. బాధితురాలు బ‌య‌ట‌కు వ‌చ్చి ఆక్రోశించినా మ‌నోడు ద‌ర్జాగా బ‌య‌ట‌కు రావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

  • Related Posts

    సీఎం జోసెఫ్ విజ‌య్ నిర్ణ‌యం రైతులు సంతోషం

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో ప్ర‌క‌టించిన ప‌రంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును ర‌ద్దు చేస్తున్న‌ట్లు శాస‌న స‌భ సాక్షిగా వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు చేప‌ట్ట‌డం వ‌ల్ల త‌మ విలువైన భూములు…

    ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం : సీఎం

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం సామాజిక వేదిక ఎక్స్ ద్వారా ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *