సంజ‌య్ రౌత్ , ఉద్ద‌వ్ ఠాక్రే ద్రోహులు : అథ‌వాలే

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రామ్ దాస్ అథ‌వాలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న శివ సేన ( బాల్ ఠాక్రే ) పార్టీకి చెందిన మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ ల‌ను ఏకి పారేశారు. ఇవాళ కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. మ‌రాఠాలో ఈ ఇద్ద‌రి నాయ‌కుల‌కు కాలం చెల్లింద‌న్నారు. ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ఏక్ నాథ్ షిండే మాజీ కేంద్ర మంత్రి ఎన్సీపీ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ పవార్ ను ఆక‌స్మికంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా త‌మ స‌ర్కార్ లో భాగస్వామ్యం కావాల‌ని కోరారు. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక మ‌రాఠా రాజ‌కీయాల‌లో క‌ల‌కలం రేపింది.

దీనిపై తీవ్రంగా స్పందించారు రామ్ దాస్ అథ‌వాలే. శరద్ పవార్ మహారాష్ట్రలో అత్యంత గౌరవనీయులైన నాయకులలో ఒకరు అని పేర్కొన్నారు. ఎన్డీయే (NDA)లో చేరాలని మేము ఆయనను అనేకసార్లు ఆహ్వానించడం జ‌రిగింద‌న్నారు . ఒకవేళ ఆయన 2014లోనే చేరి ఉంటే, భారత రాష్ట్రపతి కూడా అయ్యే వార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సంజయ్ రౌత్ చేసిన “ద్రోహులు” అనే వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ఏక్‌నాథ్ షిండేను ద్రోహి అని పిలవడం సరైనదని నేను భావించడం లేదన్నారు. నా దృష్టిలో, సంజయ్ రౌత్ , ఉద్ధవ్ ఠాక్రేలే ప్రజల తీర్పుకు ద్రోహం చేశారంటూ ఆరోపించారు.

  • Related Posts

    మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ ను వేగవంతం చేయాలి

    హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో మూసీ పైన సీఎం స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క…

    సీఎం జోసెఫ్ విజ‌య్ నిర్ణ‌యం రైతులు సంతోషం

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో ప్ర‌క‌టించిన ప‌రంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును ర‌ద్దు చేస్తున్న‌ట్లు శాస‌న స‌భ సాక్షిగా వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు చేప‌ట్ట‌డం వ‌ల్ల త‌మ విలువైన భూములు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *