భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం దారుణం : గురుమూర్తి

చిత్తూరు జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు , మాజీ టీటీడీ చైర్మ‌న్ భూమన కరుణాకర రెడ్డి కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యలను తిరుపతి లోక్‌సభ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు.రాజకీయ కక్షతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. భూమన కరుణాకర రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే త‌న‌ కుటుంబ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.

చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ రాజకీయ ప్రతీకారానికి సాధనాలుగా మారడం ఆందోళనకరమని గురుమూర్తి పేర్కొన్నారు. రాజకీయ భేదాభిప్రాయాల పేరుతో వ్యక్తిగత ఆస్తులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకర ధోరణి అని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచి వేయాలనే ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు భూమన కరుణాకర రెడ్డి భయపడే వ్యక్తి కాదని, ఇలాంటి కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రాజకీయ వేధింపులు, కక్షపూరిత చర్యలను వెంటనే నిలిపి వేయాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    ఏపీలో భూ రికార్డుల‌కు శాశ్వ‌త‌మైన భ‌ద్ర‌త

    అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తీపి క‌బురు చెప్పారు. వారికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ఇందులో భాగంగా మీ భూమి-బ్లాక్…

    26న రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 26న చేనేత సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నామని మంత్రి సవిత వెల్ల‌డించారు. చీరాలలో ప్రగడ కోటయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *