ప‌రిమ‌ళ చ‌దువు కోసం కోమ‌టిరెడ్డి రూ. 10 ల‌క్ష‌ల‌ సాయం

న‌ల్ల‌గొండ జిల్లా : మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన,నిత్య కూలీ కుమార్తె , ప్రతిభావంతురాలైన విద్యార్థిని పరిమల జర్మనీలోని ఒక ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు సీటు వ‌చ్చింది. ఇందు కోసం త‌న చ‌దువుకు అయ్యే ఖ‌ర్చును భ‌రించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు మంత్రి కోమ‌టిరెడ్డి. త‌న కొడుకు పేరుతో ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేష‌న్ ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఐఐటీ మ‌ద్రాస్ పూర్వ విద్యార్థిని అయిన పరిమల తన కఠోర శ్రమ, విద్యాపరమైన అత్యుత్తమ ప్రతిభతో ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఆమె అంతర్జాతీయ స్థాయి కలలను సాకారం చేసుకోవడంలో ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆమె కుటుంబ పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకు వ‌చ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించి, అత్యవసరమైన ఆ ఆర్థిక సహాయాన్ని అందించారు.

పేదరికం ఎప్పుడూ ప్రతిభకు అడ్డంకి కాకూడదు. సరైన అవకాశం లభిస్తే, వెనుకబడిన వర్గాల విద్యార్థులు కూడా ప్రపంచ వేదికపై అద్భుతాలు సృష్టించగలరు . అర్హులైన విద్యార్థులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి ఆశయాలకు మద్దతునిస్తాన‌ని ఈ సంద‌ర్బంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు. ఇది ఒక కల సాకారానికి అందించిన చేయూత, ప్రతిభకు లభించిన ప్రోత్సాహం, పేదరికం కారణంగా ఏ అర్హత కలిగిన విద్యార్థి కూడా తమ భవిష్యత్తును వదులు కోవాల్సిన పరిస్థితి రాకూడదనే సాయం చేశామ‌న్నారు.

  • Related Posts

    ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై ప్రచారం చేప‌ట్టాలి

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నాయకులు వాటిని నివృత్తి చేయాలన పేర్కొన్నారు. ప్రజలతో మమేకమయ్యే ఇంటింటికీ ప్ర‌చార‌ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి మంత్రులు,…

    నేత‌న్న‌ల‌ను మోసం చేసిన జ‌గ‌న్ రెడ్డి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ‌, చేనేత రంగ శాఖ మంత్రి ఎస్ స‌విత నిప్పులు చెరిగారు. ఆమె మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగ‌న్ నేత‌న్న‌లను తీవ్రంగా మోసగించారని మండిపడ్డారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *