ఆవిష్కరణల కోసం పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ : YISUలో ఆవిష్కరణల కోసం పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం నాడు రాష్ట్రంలోని ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ (YISU)లో ఆవిష్కరణల (innovation) కోసం ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ‘స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్’ (SHAKTI) విభాగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశీ భాషలను బోధించడానికి విశ్వ విద్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. రాష్ట్రంలోని ‘అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల’ (ATCs)లో ఈవీ (EV) మరియు డ్రోన్ టెక్నాలజీలకు సంబంధించిన కోర్సులను ప్రవేశ పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే ఐటీఐ (ITI)లను ఏటీసీలుగా మార్చింది. విదేశాలలో ఉద్యోగాలు పొందడంలో యువతకు సహాయపడే ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ’ (TOMCOM)ని బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే డిమాండ్‌కు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుందని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.