విశాఖపట్నం జిల్లా : తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం తయారైంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దీనిని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్టును ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఈ విమానాశ్రయాన్ని ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు ఈ సందర్బంగా సీఎం. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. తెలుగు కళలు, సంస్కృతీ వారసత్వ వైభవాన్ని చాటేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ, సంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అలంకరించారు.
విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా భారీ స్థాయి ఏటికొప్పాక కళాకృతి ఏర్పాటు చేశారు. విమానాశ్రయ ప్రాంగణం లోపల ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి అద్దం పట్టేలా తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది చిత్రాలతో పాటు భౌగోళిక వారసత్వాన్ని చాటే బంగినపల్లి మామిడి లాంటి చిత్రాలను అలంకరించారు. ప్రత్యేకించి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు 13,500 మంది గిరిజన మహిళలతో థింసా నృత్యంతో. విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ ఏర్పాటు చేశారు. . విమానాల రాకపోకలు, సర్వీసుల వివరాలు తెలియ చేసేలా ప్రయాణికుల కోసం ఎల్ఈడీ వాల్ ను ఏర్పాటు చేయడం ఎయిర్ పోర్టులో ప్రత్యేకత.






