శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, సక్రమమైన క్యూ లైన్లు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు.

భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వ్రతంలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, వ్రతం నిర్వహించే ఆస్థాన మండపాన్ని సుందరమైన పుష్పాలంకరణలతో శోభాయమానంగా అలంకరించి, మహోత్సవానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.అనంతరం చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పట్టువస్త్రాలు సమర్పించి, శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : ఏఈవో

    తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.…

    శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

    తిరుప‌తి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *