వ్య‌వ‌సాయ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు అన్యాయం జ‌ర‌గ‌దు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న వ్య‌వ‌సాయ ప‌ట్ట‌భ‌ద్రుల విద్యార్థుల‌కు తీపిక‌బురు చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన విద్యార్థుల‌కు పూర్తిగా భ‌రోసా క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. త‌మ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా విద్యార్థులు, యువ‌త‌కు ఇబ్బంది క‌లిగించే ఏ ఒక్క నిర్ణ‌యం తీసుకోద‌ని స్ప‌ష్టం చేశారు. మాది యువత గొంతుకను ప్రతిబింబించే ప్రభుత్వం అని అన్నారు సీఎం. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుే మా లక్ష్యం అని పేర్కొన్నారు డీకే శివ‌కుమార్. GKVK వ్యవసాయ విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులు నన్ను కలిసి తమ సమస్యలను వివరించినప్పుడు, మా ప్రభుత్వం వారి ఆందోళనలపై తక్షణమే స్పందించిందన్నారు.

గత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అశాస్త్రీయ నిర్ణయాలు, లోప భూయిష్టమైన నిబంధనల కారణంగా, వ్యవసాయ పట్టభద్రుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. ఆ తప్పును సరిదిద్దేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను అధికారులను ఆదేశించడం జ‌రిగింద‌ని చెప్పారు డీకే శివ‌కుమార్. ఎల్లప్పుడూ విద్యార్థుల ఆవేదనను ఆలకించే మా ప్రభుత్వం, వ్యవసాయ అధికారుల నియామక పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించిందని ప్ర‌క‌టించారు. మన వ్యవసాయ పట్టభద్రులకు ఏమాత్రం అన్యాయం జరగని రీతిలో పరీక్షను నిర్వహించడానికి మేము దృఢ నిశ్చయంతో ఉన్నామన్నారు.

  • Related Posts

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసిన జ‌గ‌న్ రెడ్డి

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్ర పరువును ,ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసింద‌న్నారు. కూటమి వచ్చాక మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం. పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమల్ని ఏర్పాటు చేయిస్తున్నాం .…

    ఏపీ సీఎంతో హెచ్ ఎస్ ఎల్ సీఎండీ కీల‌క చ‌ర్చ‌లు

    అమ‌రావ‌తి : ఏపీ సముద్ర ఆధారిత ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డులపై ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో హిందూస్తాన్ షిప్ యార్డు సీఎండీ చంద్ర‌శేఖ‌ర‌న్ ర‌ఘురామ్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క చ‌ర్చ‌లు ఈ ఇద్ద‌రి మ‌ధ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *