పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై ఫోక‌స్ పెట్టాలి : వంశీ చంద‌ర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై దృష్టి సారించాల‌ని ఇది ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు CWC ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్ఎస్ఏ జాతీయ ఇన్‌చార్జ్ చల్లా వంశీచంద్ రెడ్డి. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ వేదిక‌గా కాంగ్ర‌స్ పార్టీ ఆధ్వ‌ర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా AICC పరిశీలకుల ఓరియంటేషన్ సమావేశం నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత , అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వంలో AICC ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కె.సి. వేణుగోపాల్ మార్గదర్శకత్వంలో సంఘటన్ సృజన్ అభియాన్ చేప‌ట్టారు.

ఇందులో భాగంగా AICC పరిశీలకుల ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, లడఖ్ లో నూతన DCC అధ్యక్షుల ఎంపిక కోసం నియమితులైన AICC పరిశీలకులకు ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, బాధ్యతలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. చ‌ల్లా వంశీచంద‌ర్ రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఎంపిక ప్ర‌క్రియ పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని సూచించారు. నిజాయితీ, నిబ‌ద్ద‌త క‌లిగిన వారితో పాటు పార్టీ కోసం ముందు నుంచి శ్ర‌మించిన వారికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు వంశీ చంద‌ర్ రెడ్డి.

  • Related Posts

    పాద‌చారుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాలి

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో పాద‌చారుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాల‌ని సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ట్రాఫిక్, రహదారి మౌలిక సదుపాయాలు, వర్షాకాల సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కీల‌క మీటింగ్ లో 334 రహదారి మౌలిక…

    పోస్ట‌ల్ ఇన్‌స్పెక్టర్ కౌశిక్ కు కేంద్ర మంత్రి కంగ్రాట్స్

    న్యూఢిల్లీ : కేంద్ర టెలికాం, పోస్ట‌ల్ శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తమిళనాడు సర్కిల్‌లోని బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ ఎస్. కౌశిక్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ను చేసిన ప‌నికి ఇవాళ దేశంలోని కోట్లాది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *