న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నేత, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఝార్ఖండ్ లో శాంతియుతంగా తమ సమస్యల పరిష్కారం రోడ్డెక్కి నిరసన తెలియ చేస్తున్న విద్యార్థులపై అత్యంత దారుణంగా బల ప్రయోగం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారం ఉంది కదా అని దాడులకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఎంత కాలం ఇలా వేధింపులకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ విద్యార్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడతారంటూ ప్రశ్నించారు.
సంభాషణతోనే విద్యార్థుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఆ విషయం ఝార్ఖండ్ లో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్ గుర్తిస్తే మంచిదని హితవు పలికారు ఎంపీ రాహుల్ గాంధీ. చదువుకునే పిల్లలపై విచక్షణా రహితంగా కొట్టడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. వారి సమస్యలకు బలప్రయోగంతో కాకుండా చర్చలు, సంభాషణ ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నారు ఎంపీ. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను సానుకూలంగా విని, వారి డిమాండ్లను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






