మంత్రి నాగేంద్ర రాజీనామాకు బీజేపీ-జేడీఎస్ డిమాండ్

బెంగ‌ళూరు : భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మంత్రి బి. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షమైన జనతా దళ్ (సెక్యులర్ – జేడీఎస్) బెంగళూరులో నిరసన చేపట్టాయి. బెంగళూరులోని విధాన సౌధ వద్ద, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్‌లో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్ర‌ను వెంట‌నే తప్పించాల‌ని కోరాయి. నిరసనలో కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు , ఎమ్మెల్యే బి.వై. విజయేంద్ర తదితరులు నినాదాలు చేశారు . మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్‌లో జరిగిన భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న నాగేంద్ర‌కు కేబినెట్ లో చోటు ఎలా క‌ల్పిస్తారంటూ ప్ర‌శ్నించారు. బెంగళూరులోని విధాన సౌధలో ఉన్న వాల్మీకి విగ్రహం ముందు నిరసన తెలిపాయి. బళ్లారి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నాగేంద్ర ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్ నాకు సూచనలు ఇచ్చారు, కాబట్టి నేను ఇప్పుడు ఏమీ వ్యాఖ్యానించను. అన్ని విషయాలు కోర్టు పరిధిలో ఉన్నందున నేను స్పందించను” అని అన్నారు. అయితే, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్‌లో జరిగినట్లు ఆరోపించ బడుతున్న ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు సిద్ధంగా లేరని నాగేంద్ర పేర్కొన్నారు; వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, వారు మాత్రం సిద్ధంగా లేరని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సమయాన్ని (ఉద్దేశ పూర్వకంగా) వృథా చేస్తున్నారని ఆయన బీజేపీ నాయకులపై ఆరోపణలు చేశారు.

“వాల్మీకి కార్పొరేషన్‌లో సుమారు రూ. 187 కోట్ల ఆర్థిక అవకతవకలకు సంబంధించిన సరైన ఆధారాలు ఉన్నప్పటికీ, ఆ కుంభకోణంలో మంత్రి ప్రమేయంపై తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా సీబీఐ, ఈడీ దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ లో నాగేంద్ర ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నార‌ని, ఈ క్ర‌మంలో త‌న‌కు ఎలా మంత్రి ప‌ద‌వి ఇస్తార‌మంటూ మ‌రోసారి నిల‌దీశారు.

  • Related Posts

    గ్లోబ‌ల్ నాలెడ్జ్ హ‌బ్ గా హైద‌రాబాద్ : సీఎం

    లండన్ : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో అత్యంత ఫలప్రదమైన, ఆసక్తికరమైన సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, అంతే కాకుండా ప్రపంచ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’…

    కేపీఎస్సీ ఛైర్మన్‌పై చర్యలకు కర్ణాటక కేబినెట్ సిఫార్సు

    బెంగ‌ళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) ఛైర్మన్ శివశంకరప్ప సహుకర్‌పై శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ కర్ణాటక కేబినెట్ తీర్మానించింది. సహుకర్‌కు సంబంధించిన ఆయన నివాసం, కార్యాలయంతో సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *