తిరువనంతపురం : పులిమురుగన్, నారన్, తుడరుమ్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పేరుగాంచిన ప్రముఖ మలయాళ ఛాయాగ్రాహకుడు షాజీ కుమార్ కన్నుమూశారు. అలప్పుజలో ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆరోగ్య సమస్యకు గురై 57 ఏళ్ల వయసులో మరణించారు. ఫిల్మ్ నుండి డిజిటల్ చిత్ర నిర్మాణానికి విజయవంతంగా మారిన అగ్రశ్రేణి ఛాయాగ్రాహకుడిగా ఆయనను గుర్తు చేసుకున్న మలయాళ చిత్ర పరిశ్రమను ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. మోహన్‌లాల్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలైన పులిమురుగన్, నారన్, తుడరుమ్లకు పని చేశాడు. దిలీప్ నటిస్తున్న ఒక రాబోయే చిత్రం షూటింగ్ కోసం కుమార్ అలప్పుజలో ఉన్నప్పుడు తన హోటల్ గదిలో శారీరక అసౌకర్యానికి గురయ్యారు.
ఆయన తన అసౌకర్యం గురించి చిత్ర దర్శకుడు ఉల్లాస్ కృష్ణకు తెలియజేయగా మొదట సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతడిని ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మార్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చేరిన తర్వాత అతని పరిస్థితి మెరుగుపడింది. మామూలుగా మాట్లాడ గలిగినప్పటికీ ఆదివారం రాత్రి అతని ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని వర్గాలు తెలిపాయి. అతని ఆకస్మిక మరణం మలయాళ చిత్ర పరిశ్రమ సభ్యులను దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురి చేసింది. మలయాళ సినిమాకు ఆయన చేసిన సేవలకు నివాళులర్పిస్తూ ఫెఫ్కా డైరెక్టర్స్ యూనియన్ ఆయన మరణం పట్ల సంతాపం తెలిపింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ శిష్యుడైన కుమార్ స్వతంత్ర సినిమాటోగ్రాఫర్‌గా స్థిరపడక ముందు పలు చిత్రాలకు పనిచేసి తన కెరీర్‌ను ప్రారంభించారు.




