Wednesday, 18 November 2026
Trending

108 అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను ప‌రిశీలించిన సీఎం

newsseals-CM

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. చెన్నై లో ఆయ‌న ఆక‌స్మిక త‌నిఖీ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన‌సాగుతున్న 108 అత్య‌వ‌స‌ర సేవ‌లపై ఆరా తీశారు. ఇదే క్ర‌మంలో చెన్నైలోని డి.ఎం.ఎస్. (DMS) ప్రాంగణంలో పనిచేస్తున్న ‘108’ అత్యవసర స్పందన కాల్ సెంటర్‌ను సందర్శించారు. దాని పనితీరును పరిశీలించారు. ఉన్న‌ట్టుండి సీఎం రావ‌డంతో అక్క‌డున్న సిబ్బంది ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ఈ సంద‌ర్బంగా రోజూ వారీ కాల్స్ , స్పందిస్తున్న తీరు, సేవ‌లు అందిస్తున్న వివ‌రాల‌ను సీఎం జోసెఫ్ విజ‌య కు సిబ్బంది తెలియ చేశారు.

ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడులో విద్య‌, వైద్య , పారిశ్రామిక‌, ఉపాధి రంగాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు సీఎం. ఈ మేర‌కు ఇదే త‌మ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు. పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీల‌ను ఒక్క‌టొక్క‌టిగా అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న పార‌ద‌ర్శ‌క పాల‌న‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. ఎవ‌రైనా అవినీతికి పాల్ప‌డితే త‌న‌కు నేరుగా ఫోన్ చేయాల‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. అంతే కాకుండా ఆస్ప‌త్రుల‌లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే అక్క‌డి వైద్య బిల్లుల‌ను తామే చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు సీఎం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *