బెంగళూరు : కర్ణాటకకు చెందిన ప్రముఖ నటి రమ్య సంచలనంగా మారారు. ఆమె మహిళల ఆరోగ్య సంరక్షణపై ఫోకస్ పెట్టారు. ప్రతి బాలిక, మహిళలకు నెల నెలా వచ్చే రుతు సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తన ఆద్వర్యంలో రుతు తార అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నటి రమ్య. ఆమె గతంలో ఎంపీగా కూడా పని చేశారు. మహిళల అభ్యున్నతి, సాధికారతపై ఎక్కువగా దృష్టి సారించారు తను. ఇదిలా ఉండగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు నటి రమ్య.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘ఋతు తార’ (Ruthu Taare)కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నటి, మాజీ ఎంపీ రమ్యను ప్రత్యేకంగా అభినందించారు సీఎం. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించడం జరిగిందన్నారు సీఎం. ఈ సమావేశంలో ప్రొఫెసర్ నేత్రతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ‘ఋతు తార’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం, 35 ఏళ్లు పైబడిన మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై మెనోపాజ్ (రజోనివృత్తి) దశలో వారికి అవసరమైన సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించడం.
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘ఋతు తార’కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించిన నటి, మాజీ ఎంపీ రమ్యతో ఫలప్రదమైన చర్చలు జరపడం ఆనందంగా ఉందన్నారు సీఎం. మెనోపాజ్‌కు సంబంధించి సమాజంలో ఉన్న మౌనాన్ని ఛేదించే దిశగా, అలాగే మహిళల ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత, అవగాహన , సంరక్షణ అందేలా చూసేందుకు మేము కలిసి ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామన్నారు.




