ఇడుపు కాయితం నుంచి ‘ఉల్లిపూల’ సాంగ్
హైదరాబాద్ : ప్రియదర్శి పులికొండ, నాగ దుర్గ గుత్త , అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇడుపు కాయితం’ చిత్రానికి వంశీ రెడ్డి దొండాపాటి దర్శకత్వం వహించారు. బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మాతలుగా, ‘బన్నీ వాస్ వర్క్స్ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందింది. కుటుంబ ప్రేక్షకులను అలరించే ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటి వరకు విడుదలైన పాటలు విభిన్న సంగీత శైలులతో అలరించగా, తాజాగా చిత్ర బృందం ‘ఉల్లిపూల’ అనే ఉత్సాహ భరితమైన జానపద గీతాన్ని విడుదల చేసింది. శక్తివంతమైన లయ, అద్భుతమైన నృత్యం , పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ పాట ప్రేక్షకులకు ఒక చక్కని సంగీత అనుభూతిని అందిస్తుంది.
సురేష్ బొబ్బిలి స్వరపరిచిన ఈ పాట ఆకట్టుకునే బీట్స్ , శక్తివంతమైన జానపద అంశాలతో ప్రత్యేకంగా నిలిచింది. హేనాగ్రేస్ తన ఉత్సాహభరితమైన గాత్రంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు.నాగ దుర్గ గుత్త తన నృత్య ప్రదర్శనతో ఈ పాటకు దృశ్యపరమైన ఆకర్షణను జోడించారు. ఆమె హావభావాలు . చురుకైన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు మరింత మెరుపును తెచ్చాయి. అభినయ శ్రీనివాస్ రాసిన సాహిత్యం ఈ పాటలోని జానపద సొగసును మరింత పెంచింది. ఆకట్టుకునే సంగీతం, ఉత్సాహ భరితమైన నృత్యాలు , రంగుల దృశ్యాలతో ‘ఉల్లిపూల’ చిత్రం సంగీత ఆల్బమ్‌లో ఒక అద్భుతమైన భాగంగా నిలిచింది. నాగ దుర్గ గుత్తా ప్రదర్శన , పాటలోని పండుగ వంటి ఉత్సాహం, ‘ఇడుపు కాయితం’ చిత్ర సంగీత ప్రయాణంలో మరో ఆకర్షణీయమైన అంశంగా మారాయి.