బ్రహ్మోత్సవాలకు గడువు లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి

Spread the loveఉన్న‌తాధికారుల‌కు నూత‌న ఈవో దిశా నిర్దేశం తిరుమ‌ల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు…

newsseals-eottd
Spread the love

ఉన్న‌తాధికారుల‌కు నూత‌న ఈవో దిశా నిర్దేశం

తిరుమ‌ల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువు లోపుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ, భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించాలో సీఎం సూచించారన్నారు. అదే విధంగా టిటిడి చైర్మెన్ వచ్చే ఫీడ్ బ్యాక్, బోర్డు మెంబర్స్, డయల్ యువర్ ఈవో, ఐవిఆర్ఎస్, వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ, సర్వే తదితర మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అభిప్రాయ సేకరణ తీసుకుని ఇంకా మెరుగైన సేవలను అందించే అంశంపై దృష్టి పెట్టాలని కోరారు.

అదేవిధంగా వీలైనంత వరకు ఆధునిక టెక్నాలజీ సాయంతో మరింత మెరుగైన సేవలు అందించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. టిటిడిలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports